Sun Feb 01 2026 08:11:56 GMT+0000 (Coordinated Universal Time)
పూతలపట్టులో లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు పూతలపట్టు నియోజకవర్గంలో జరుగుతుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు పూతలపట్టు నియోజకవర్గంలో జరుగుతుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పలువురు యువతీయువకులు పాల్గొన్నారు. పదో రోజు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.
కాణిపాకం ఆలయంలో...
కొద్దిసేపట్లో ఆయన కాణిపాకం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోడ్లపై సభలకు అనుమతించకపోవడంతో ఆయన మిద్దెలెక్కి ప్రజలతో మాట్లాడుతున్నారు. లోకేష్ పాదయాత్రలో అడుగడుగునా ఆటంకం కల్పిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ లోకేష్ తన పాదయాత్ర చేస్తున్నారు.
Next Story

