Fri Apr 03 2026 17:22:44 GMT+0530 (India Standard Time)
జగన్ కు నారా లోకేష్ లేఖ... ఇలా చేస్తే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని కోరారు. థర్డ్ వేవ్ దృష్ట్యా కేసులు పెరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలలను నడపటం సరికాదని లోకేష్ హితవు పలికారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడాన్ని లోకేష్ ఈ లేఖలో గుర్తు చేశారు.
ఇతర రాష్ట్రాలు....
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని తెలిపారు. పదిహేనేళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదని, వారు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం మంచిది కాదని లోకేష్ లేఖలో తెలిపారు. పది రోజుల్లోనే కేసుల సంఖ్య ఎంత పెరిగిందో గుర్తుకు తెచ్చుకోమన్నారు.
Next Story

