Sat Apr 04 2026 04:24:34 GMT+0530 (India Standard Time)
జగన్ కు నారా లోకేష్ లేఖ...ఈ అడ్డగోలు నిబంధనలేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు సంక్షేమ పథకాలు దూరం చేసే విధంగా నిబంధనలున్నాయని అన్నారు. అడ్డగోలు నిబంధనలను వెంటనే తొలగించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. గిరిజనులకు అనేక ప్రాంతాల్ల పింఛన్లను, రేషన్లను నిలిపివేశారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
పునరుద్ధరించాలని.....
వెంటనే గిరిజనులకు నిలిపేసిన పింఛన్లను, రేషన్ కార్డులను పునరుద్ధరించాలని నారా లోకేష్ కోరారు. గిరిజనులకు పది ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలను నిలిపేయాలని నిబంధనలను విధించడమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ నిబంధనలు గిరిజనుల పాలిట శాపంగా మారాయని లేఖలో పేర్కొన్నారు.
Next Story

