Sat Apr 04 2026 10:36:16 GMT+0530 (India Standard Time)
జగన్ ను లోకేష్ ఎంతమాటన్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ బెటర్ అని నారా లోకేష్ అన్నారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని అన్నారు. మంత్రి బొత్స కాన్వాయ్ ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకున్న విద్యార్థులను అరెస్ట్ చేయడమం పాశవికమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
వారి బాధలు...
సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులను చూసి జాలి పడాల్సి వస్తుందన్నారు. కనీసం వారితో చర్చలు జరిపేందుకు కూడా ముందుకు రాలేదన్నారు లోకేష్. పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Next Story

