Sat Apr 04 2026 05:52:14 GMT+0530 (India Standard Time)
దేశంలో కల్లా వరెస్ట్ సీఎం జగన్
దేశంలోనే జగన్ వరెస్ట్ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు.

దేశంలోనే జగన్ వరెస్ట్ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని ఆయన అన్నారు. జగన్ నివాసానికి దగ్గరలోనే డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. జగన్ ను అధికారం నుంచి దించితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
తనపై దుష్ప్రచారం...
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో తనపై దుష్ప్రచారం చేశారని లోకేష్ ఆరోపించారు. లోకేష్ ను గెలిపిస్తే మంగళగిరిలో ఇళ్లు పీకేస్తారని ప్రచారం చేశారన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత పేదల ఇళ్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆళ్ల మంగళగిరికి గెస్ట్ లెక్చరర్ గా మారిపోయారని లోకేష్ ఎద్దేవా చేశారు.
Next Story

