Mon Feb 02 2026 04:47:16 GMT+0000 (Coordinated Universal Time)
చట్టం మీ ఎదగూరి సంధింటికి ఎదురింటి చుట్టమా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏమైనా నీ జాగీరా జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. ఏపీలో ఎమెర్జెన్సీని ప్రకటించారా? అని నిలదీశారు. కుప్పంలో ఏకంగా అప్రకటిత యుద్ధమే ప్రకటించారన్నారు. అర్థరాత్రి చీకటి జీవో ఇస్తావని, తెల్లారేసరికి ఉల్లంఘిస్తావని, చట్టం మీ ఎదుగూరి సంధింటికి ఎదురింటి చుట్టమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
కుప్పంలో నీ కుప్పిగంతులు...
ప్రతిపక్ష నేత చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటిండానికి నీ ఆంక్షలేంటి? అని లోకేష్ ప్రశ్నించారు. నీ కుతంత్రాలన్నీ కుప్పంలో ప్రయోగిస్తున్నావని, చంద్రబాబు ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నావని, కార్యకర్తలను కొట్టిస్తూ, నాయకులను నిర్భందిస్తున్నావని ఆయన ఆరోపించారు. ఎన్ని అరాచకలకు పాల్పడినా నీపై ప్రజా వ్యతిరేకత తగ్గలేదని, చంద్రబాబుపై జనాదరణ పెరుగుతూనే ఉంటుందని, 35 ఏళ్లుగా కుప్పం నీలాంటి కుట్రదారులను ఎంతోమందిని చూసిందని అన్నాు. తెలుగుదేశం కోట కుప్పంలో నీ కుప్పిగంతులు చెల్లవని చెప్పారు. పసుపు సైన్యం కదం తొక్కుతుందన్నారు.
Next Story

