Sat Apr 04 2026 16:52:38 GMT+0530 (India Standard Time)
గాల్లో తిరుగుతూ.. జనాన్ని పట్టించుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరియల్ సర్వే పేరుతో గాల్లో తిరుగుతూ రాయలసీమను పట్టించుకోలేదన్నారు. నేల మీదకు దిగి జనం కష్టాలను కూడా జగన్ చూసే పరిస్థితి లేదన్నారు లోకేష్. రోమ్ తగలపడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు జగన్ పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశఆరు.
ప్రభుత్వ వైఫల్యం వల్లనే.....
రాయలసీమ వరదల తాకిడికి అల్లకల్లోలమయితే కనీసం పరామర్శించేందుకు కూడా జగన్ కు ఓపిక లేదని నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇంతటి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. కనీసం ఎంతమంది చనిపోయారో కనుక్కునే తీరిక కూడా జగన్ రెడ్డికి లేదని లోకేష్ అన్నారు.
Next Story

