Sat Apr 04 2026 18:27:01 GMT+0530 (India Standard Time)
ఎంత తపస్సు చేసినా జగన్ కు సాధ్యం కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని మూడు ముక్కలు చేసి రైతులకు జగన్ అన్యాయం చేశారన్నారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలని కుట్ర పన్నారని ఆన ఆరోపించారు. జగన్ ఎంత తపస్సు చేసినా మూడు రాజధానులను నిర్మించలేరని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమరావతికి కులాన్ని అంటగట్టడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు.
రైతులకు మద్దతుగా....
అమరావతి రైతుల ఆందోళనలు నేటికి 700 వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వారి మహా పాదయాత్రకు నారా లోకెేష్ సంఘీభావం తెలిపారు. రైతుల వైపు న్యాయం ఉందని, చివరకు గెలిచేది రైతులేనని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Next Story

