Sat Dec 20 2025 15:59:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో ఉన్న పరిశ్రమలకు జగన్ రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. జగన్ విడుదల చేసిన పోస్టర్ లో ఏ ఒక్క కంపెనీ ఆయన తెచ్చింది కాదన్నారు. ఏపీిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలితంగానే కంపెనీలు వచ్చాయన్నారు లోకేష్.
తానే తెచ్చినట్లు...
కానీ వాటిని తానే తెచ్చినట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ రెడ్డికి వ్యవసనంగా మారిందని లోకేష్ ధ్వజమెత్తారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ లో పరిశ్రమలను ప్రారంభించి మరోసారి అడ్డంగా జగన్ దొరికిపోయాడని లోకేష్ విమర్శించారు.
Next Story

