Wed Apr 01 2026 04:56:26 GMT+0530 (India Standard Time)
జగన్ రెడ్డి ఈ పేర్ల మార్పిడి పిచ్చి ఏంటి?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుందన్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినజగన్ తాజాగా విజయనగరలోని మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలువైన భూమిని...
విజయనగరం నడిబొడ్డున ఉండే విలువైన భూమిని ఆసుపత్రి కోసం మహారాజ కుటుంబం ఇచ్చిన విషయాన్ని జగన్ మర్చి పోయారన్నారు. కేంద్ర మంత్రిగా ఆ ఆసుపత్రికి నిధులు కేటాయించి అత్యాధునిక వసతులను కల్పించిన ఘనత అశోక్ గజపతి రాజుకు దక్కుతుందన్నారు. రాత్రికి రాత్రి మహారాజ పేరును తొలగించడాన్ని లోకేష్ ఖండించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

