Sat Apr 04 2026 05:52:14 GMT+0530 (India Standard Time)
జగన్ పై నారా లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇసుక అక్రమాలకు ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా పోతుందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్లనే 39 మంది జల సమాధి అయ్యారని నారా లోకేష్ ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టులో మృతుల కుటుంబాలు తేరుకోక ముందే ఇసుక ట్రాక్టర్లు గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాయని నారా లోకేష్ ఆరోపించారు.
ఇసుక మాఫియాతో...
జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమయిందని నారా లోకేష్ ఆరోపించారు. కడప జిల్లా నందలూరు మండలంలో ఇసుక విక్రయాలను వెంటనే ప్రారంభించటమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇసుక మాఫియాతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు నారా లోకేష్.
Next Story

