Wed Apr 01 2026 06:51:36 GMT+0530 (India Standard Time)
జగన్.. తిరుమలలో ప్రమాణం చేయగలవా?
తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు

తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు తన కుటుంబానికి సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా తిరుమలలో ప్రమాణ స్వీకారం చేస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు.
తాను గతంలో...
వివేకానందరెడ్డి హత్యతో తనకు గాని, తన కుటుంబానికి గాని సంబంధం లేదని ఏప్రిల్14 2021వ సంవత్సరంలో తాను ప్రమాణం చేశానని లోకేష్ తెలిపారు. అదే ప్రమాణాన్ని తిరుమల వెళుతున్న మీరు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్తచరిత్ర అని ఒప్పుకుంటారా? అని ఆయన వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.
Next Story

