Sun Mar 15 2026 16:56:27 GMT+0530 (India Standard Time)
లోకేష్ యువగళానికి బ్రేక్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 12, 13వ తేదీల్లో విరామం ప్రకటించారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 12, 13వ తేదీల్లో విరామం ప్రకటించారు. ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున అధికారులు అభ్యంతరం తెలిపారు. నియోజకవర్గాన్ని వీడాలంటూ లోకేష్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఎన్నికల సంఘాన్ని, చట్టాన్ని గౌరవించి తాను జిల్లాను వీడుతున్నట్లు లోకేష్ తెలిపారు.
హైదరాబాద్ కు లోకేష్...
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆయన మొత్తం 529.1 కిలోమీటర్ల దూరం నడిచారు. ఆయన 41వ రోజులు పాదయాత్ర చేశారు. 42వ రోజు పాదయాత్ర ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. కంటేవారిపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, ఈ రెండు రోజుల పాటు యాత్రకు ఆయన విరామం ప్రకటించారు.
- Tags
- nara lokesh
- break
Next Story

