Fri Dec 05 2025 20:12:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు యువగళానికి విరామం
నేడు రంజాన్ పండగ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు.

నేడు రంజాన్ పండగ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ముస్లిం సోదరులు ప్రార్థనల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. ఈరోజంతా లోకేష్ విశ్రాంతి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
విశ్రాంతి తీసుకోనున్న...
ఇప్పటి వరకూ నారా లోకేష్ 1004,8 కిలోమీటర్ల దూరం నడించారు. తిరిగి ఆదివారం పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆదోని పట్టణంలో పర్యటన సందర్భంగా 21వ వార్డును దత్తత తీసుకుంటున్నట్లు లోకేష్ ప్రకటించారు. సిరిగుప్ప వద్ద వెయ్యి కిలోమీటర్ల శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. పెద్దయెత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు లోకేష్ పాదయాత్రకు తరలి వచ్చారు.
- Tags
- nara lokesh
- break
Next Story

