Fri Dec 05 2025 16:55:52 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ యువగళం @ 500 కి.మీ
ఈరోజు లోకేష్ యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరుకోనుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది. నేటికి 39వ రోజుకు లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంది పూలవాండ్లపల్లి విడిది కేంద్రం నుంచి బయలుదేరిన లోకేష్ వివిధ సామాజికవర్గాల వారితో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు.
మదనపల్లి నియోజకవర్గంలో...
ఈరోజు లోకేష్ యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరుకోనుంది. సీటీఎం వద్ద ఐదు వందల కిలోమీటర్లు దాటినట్లు శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించనున్నారు. లోకేష్ పాదయాత్ర జనవరి 27వ తేదీన ప్రారంభమై ఇప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతుంది. ఆయన అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పాదయాత్ర వెళ్లేలా ప్లాన్ చేసుకోవడంతో ఇన్ని రోజుల సమయం పట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

