Wed Jan 21 2026 01:25:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెజవాడకు లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విజయవాడకు చేరుకోనున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన రాజమండ్రికి చేరుకుంటారు. ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కానున్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన గత కొద్దిరోజులుగా ఉన్నారు. యువగళం పాదయాత్రకు కూడా తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. గత నెల 9వ తేదీన రాజోలు నియోజకవర్గంలోనే యువగళం పాదయాత్ర నిలిపివేసింది.
చంద్రబాబుతో ములాఖత్...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి గత నెల10వ తేదీన రాజమండ్రి జైలుకు వెళ్లారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అక్కడే ఉన్నారు. దీంతో న్యాయనిపుణులతో సంప్రదించేందుకు గాను ఆయన గత నెల 18వ తేదీన ఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. అయితే ఈ నెల 10వ తేదీన ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని హైకోర్టు సూచించడంతో ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు.
Next Story

