Sat Dec 06 2025 06:04:36 GMT+0000 (Coordinated Universal Time)
TDP : గులకరాయి డ్రామాపై విచారణ జరుపుతాం
విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా జబర్దస్త్ కామెడీ చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా జబర్దస్త్ కామెడీ చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అరచేతిలో పట్టేంత రాయితో కొడితే ఆ వ్యక్తి అక్కడే కిందపడిపోతారని, కోడికత్తి డ్రామా ఆడి సానుభూతితో 2019లో ఓట్లు సాధించారన్నారు. సీఎంపై దాడి ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు.
రాయే దొరకలేదన్న సీపీ...
నిన్న సాయంత్రం అసలు రాయే దొరకలేదని సీపీ రాణా ప్రకటించారని, నిందితుల సమాచారం చెబితే రూ.2 లక్షలు ప్రకటిస్తామని నిన్న ప్రకటించిన పోలీసులు నేడు ఇప్పుడేమో నిందితులు దొరికారు అంటున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావన్నారు. ఎన్డీయే కూటమి వచ్చాక గులకరాయి డ్రామాపై విచారణ చేయిమని పట్టాభిరామ్ తెలిపారు.
Next Story

