Wed Jan 22 2025 13:45:49 GMT+0000 (Coordinated Universal Time)
చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం : ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
చంద్రబాబు, ఆయన కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని తెలిపారు. చంద్రబాబును తిడితేనో, టీడీపీ ఆఫీసులపై దాడి..
అమరావతి : వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై ఇష్టారాజ్యంగా చెత్తవాగుడు వాగినా.. అసత్య ఆరోపణలు చేసినా చంపడానికైనా, చావడానికైనా తాము సిద్ధమన్నారు బుద్ధా వెంకన్న.
అందుకోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ ను తయారు చేశామన్న ఆయన.. చంద్రబాబు, ఆయన కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని తెలిపారు. చంద్రబాబును తిడితేనో, టీడీపీ ఆఫీసులపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనే భ్రమల్లో నుంచి బయటకు రావాలని హితవు పలికారు. అలాగే వైసీపీలో ఉన్న సీనియర్ నేతలను కాదని జోగి రమేష్ కు మంత్రి పదవి ఎలా వచ్చిందో ఆ పార్టీ నేతలో ఆలోచించాలని సూచించారు.
Next Story