Tue Mar 24 2026 14:08:11 GMT+0530 (India Standard Time)
తాగానీటి ఎద్దడికి కారణం జగనే
జగన్ అసమర్థత వల్లే కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు

జగన్ అసమర్థత వల్లే కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. వేసవిలో జగన్ పాలనలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయననారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కొందరు పోలీసులు అత్యుత్సాహంతో టీడీపీ శ్రేణులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అధికారులను వదిలిపెట్టబోం
అటువంటి అధికారులను తాము అధికారంలోకి రాగానే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థుల మార్పు జరుగుతుందటూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి కోరారు. అభ్యర్థులను మార్చడం అంటూ జరిగితే స్వయంగా చంద్రబాబు ప్రకటిస్తారని ఆయన తెలిపారు.
Next Story

