Sun Mar 15 2026 06:10:54 GMT+0530 (India Standard Time)
వైసీపీకి అశోక్ బాబు ఛాలెంజ్
వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఛాలెంజ్ విసిరారు

వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో ద్వారా 100 మందికి కూడా విదేశీ విద్య అందదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఛాలెంజ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్యను చదివేందుకు 4,900 మందికి అవకాశం కల్పించానని ఆయన పేర్కొన్నారు. విదేశీ విద్య రద్దు చేయడంతో యువతలో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో....
తమ ప్రభుత్వ హయాంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి అవకాశం కల్పిస్తే ఇప్పుడు ఒక్కరికే ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య కోసం 365 కోట్లను ఖర్చు చేశామన్నారు. మీరు ఎంత కేటాయించాలో చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. అమ్మఒడికి షరతులు పెట్టినట్లు విదేశీ విద్యలో కూడా షరతులు విధించడం అన్యాయమన్నారు.
Next Story

