Sat Dec 06 2025 09:17:03 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజూ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఒకరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఒకరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. పోడియం వద్దకు చేరి పెద్దయెత్తున నినాదాలు చేశారు. ధరల పెరుగుదలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చించాలని పట్టుబట్టడంతో 14 మంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
వాయిదా తీర్మానం.....
పదే పదే సభకు అడ్డుతగులుతుండటంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు ప్రతిరోజూ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను వారు హరిస్తున్నారని, పదే పదే సభకు అంతరాయం కలిగిస్తుండటంతో సభా సమయం కూడా వృధా అవుతుందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోవాలని సూచించారు.
Next Story

