Thu Mar 12 2026 15:57:13 GMT+0530 (India Standard Time)
మూడు రాజధానుల అంశమేదీ?
గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు

గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగం లో ఎందుకు పెట్టలేకపోయిందన్నారు. పాత గవర్నర్ ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం, ప్రస్తుత గవర్నర్ స్థాయి తగ్గించారని పయ్యావుల కేశవ్ అన్నారు. గవర్నర్ తో ముఖ్యమంత్రి ని పొగిడించటమేంటి? అని నిలదీశారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా ? అని ప్రశ్నించారు.
అబద్దాలు చెప్పించి...
రాష్ట్ర ప్రథమ పౌరుడితో ముఖ్యమంత్రిని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారన్నారు. గవర్నర్ ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారని, ఇది సభా నిభంధనలకు విరుద్ధమన్న పయ్యావుల శాంతి భద్రతల అంశం ఎక్కడా ప్రసంగం లో లేదన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పించే యత్నం చేశారని పయ్యావుల కేశవ్ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది గా చేసిన గవర్నర్ తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందన్నారు.
Next Story

