Sun Mar 15 2026 07:41:01 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : గవర్నర్ ను కలిసిన నారా లోకేష్
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ బృందం కలిసింది. చంద్రబాబుపై వరసగా నమోదవుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ బృందం కలిసింది. చంద్రబాబుపై వరసగా నమోదవుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు చేసింది. నారా లోకేష్ నేతృత్వంలో బృందం గవర్నర్ ను కలసి వినతి పత్రాన్ని సమర్పించింది. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని నారా లోకేష్ గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది.
కేసుల జాబితాను..
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై ఇప్పటి వరకూ పెట్టిన కేసుల జాబితాను కూడా ఈ సందర్భంగా టీడీపీ బృందం గవర్నర్ కు ఇచ్చింది. నారా లోకేష్ తో పాటు గవర్నర్ ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబులు ఉన్నారు.
Next Story

