Sun Mar 15 2026 00:13:41 GMT+0530 (India Standard Time)
జగన్ రెండు లక్షల కోట్ల దోపిడీ.. టీడీపీ ఫైర్
అవినీతిలో నెంబర్ వన్ జగన్ అంటూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు

అవినీతిలో నెంబర్ వన్ జగన్ అంటూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. మూడేళ్లలో జగన్ రెండు లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేశారని నారా లోకేష్ ఆరోపించారు. లేపాక్షి భూములను సయితం జగన్ కుటుంబం కబ్జా చేసిందన్నారు. ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా వదిలిపెట్టడం లేదన్నారు.
స్కాం రెడ్డిగా మారి....
జగన్ రెడ్డి స్కాం రెడ్డిగా మారి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారన్నారు. ఇసుకను కూడా వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారని నారా లోకేష్ మండి పడ్డారు. జగన్ వాకిట్లో గంజాయి చెట్లు అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎర్రచందనాన్ని వైసీపీ నేతలు ఏటీఎంగా మార్చుకున్నారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
Next Story

