Sun Mar 15 2026 11:57:16 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీలో గందరగోళం.. సభ కొద్దిసేపు వాయిదా
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎలా మారుస్తారంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగారు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎలా మారుస్తారంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఎన్టీఆర్ పేరును మార్చడానికి వీలు లేదని తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ పేరు మార్చలేదని, ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎలా మారుస్తారంటూ టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. సభలో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
హెల్త్ యూనివర్సిటీ పేరును...
దీంతో సభను కొద్దిసేపే స్పీకర్ వాయిదా వేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ పేరును పెట్టాలని ప్రభుత్వం ఈరోజు బిల్లు ప్రవేశపెట్టనుంది. దీనిపై సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పేపర్లు చించి వేసి స్పీకర్ టేబుల్ పై వేశారు. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు సభను వాయిదా వేశారు.
Next Story

