Sun Dec 07 2025 10:44:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు
టీడీపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. నందిగామలో జరిగిన చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడిపై ఫిర్యాదు చేయనున్నారు.

నేడు తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. నందిగామలో జరిగిన చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడిపై ఫిర్యాదు చేయనున్నారు. నందిగామ పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
నందిగామ ఘటనపై...
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబులు గవర్నర్ ను కలిసే వారిలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాళ్ల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్ ను టీడీపీ బృందం కోరనుంది.
Next Story

