Wed Jan 21 2026 14:42:00 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఏపీ గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతల బృందం
పల్నాడు, రాయలసీమలో హింసాత్మక ఘటనలపై టీడీపీ నేతలతో కూడిన బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసింది

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతలు కలిశారు. పల్నాడు, రాయలసీమలో హింసాత్మక ఘటనలపై టీడీపీ నేతలతో కూడిన బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అనంతరం వైసీపీ నేతలు హింసకు దిగుతున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.
ఎన్నికల అనంతరం హింసను...
ఆస్తులను ధ్వసం చేయడమే కాకుండా హత్యలకు కూడా తెగబడుతున్నారని ఆరోపించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరింది. లేకుంటే మరింతగా హింస చెలరేగే అవకాశముందని పేర్కొంది. దీనిపై డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసను అరికట్టాలని కోరారు.
Next Story

