Sun Mar 15 2026 18:21:32 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు నేడు కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు నేడు కలవనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ నేతలకు రాజ్ భవన్ అపాయింట్ మెంట్ లభించింది. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసు వివరాలను గవర్నర్ కు టీడీపీ నేతలు తెలియజేయనున్నారు.
బర్త్‌రఫ్ చేయాలంటూ....
అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని గవర్నర్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కోరనున్నారు. గవర్నర్ ను మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నేతృత్వంలో పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావు, ఎంఎస్ రాజులు కలవనున్నారు. వెంటనే అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని, జైలులో ఆయనకు అందుతున్న సౌకర్యాలపై కూడా గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
Next Story

