Thu Mar 19 2026 16:44:27 GMT+0530 (India Standard Time)
టీడీపీ తిక్కారెడ్డి.. టీ అమ్ముకోవాల్సిందేనా?
టీడీపీ నేత తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎన్నికలకు దిగితే ఆస్తులు అమ్ముకుని అడుక్కోవాల్సిందేనని అన్నారు

తెలుగుదేశం పార్టీ నేత తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎన్నికలకు దిగితే ఆస్తులు అమ్ముకుని అడుక్కోవాల్సిందేనని ఆయన అన్నారు. మొన్న జరిగిన ఎన్నికలకే ఖర్చు చేశామని, ఈసారి ఎన్నికలు జరిగితే ఆస్తులు అమ్ముకుని టీ అమ్ముకోవాల్సిందేనని తిక్కారెడ్డి అన్నారు. ఆర్టీసీ పెంపు ఛార్జీలను నిరసిస్తూ మంత్రాలయంలో చేసిన ఆందోళన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ పార్టీ నుంచి...
జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు మూటలు సంచులు అందుతున్నాయన్నారు. అందుకే ఎమ్మెల్యేలు దేవుడి ఫొటో తీసేసి జగన్ ఫొటో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులు మూటలు వస్తున్నాయన్నారు. కానీ టీడీపీ వాళ్లు సర్పంచ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వరకూ ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు గోనెసంచులతో డబ్బులు సంపాదించుకుంటారని ఆయన అన్నారు.
Next Story

