Thu Mar 19 2026 12:36:52 GMT+0530 (India Standard Time)
కొడాలి సంక్రాంతి సంపాదన 250 కోట్లు
కొడాలి నాని పై టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని సంక్రాంతి సంపాదన 250 కోట్లు అని ఆయన అన్నారు.

కొడాలి నాని పై టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని సంక్రాంతి పండగ కలెక్టన్ 250 కోట్లు అని ఆయన అన్నారు. గుడివాడలో గోవా కల్చర్ ను కొడాలి నాని తీసుకొచ్చారన్నారు. ఆయన సంక్రాంతి పండగకు కోట్లలో సంపాదించడానికి గుడివాడలో క్యాసినోను ఏర్పాటు చేశారన్నారు.
విచారణ జరపాలి....
దీనిపై డీజీపీ వెంటనే విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వర్మ కోరారు. కోట్ల రూపాయలు ఆర్జించడానికే కొడాలి నాని సంక్రాంతి పండగను ఉపయోగించుకున్నారన్నారు. ఉద్యోగులకు జీతాలు లేక, పింఛనుదారులకు పెన్షన్లు రాక అవస్థలు పడుతుంటే కొడాలి నాని మాత్రం కోట్ల రూపాయల ఆర్జనకు దిగారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు.
Next Story

