Fri Dec 05 2025 11:21:19 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో కాళ్ల బేరాలు..ఏపీలో వీధి నాటకాలా..?
వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న ఆందోళనలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు

వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న ఆందోళనలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సమస్య దేశమంతా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో కాళ్ల బేరాలు..ఏపీలో వీధి నాటకాలా..? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కానీ ఆంధ్రప్రదేశ్ పై ఆ ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారని అననారు.
యూరియాను తెచ్చినా...
కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ఈ రోజు కూడా 50 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయింపజేశారన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఢిల్లీలో యూరియా పేరు ఎత్తే దమ్ము లేక ఇక్కడ వీధి నాటకాలకు తెరలేపారా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత లేదని, కావాలనే వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Next Story

