Thu Jan 29 2026 07:39:29 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ పై నారా లోకేష్ ధ్వజం !

చిత్తూరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైందని, దిశ వాహనాలకు జెండాఊపి మహిళల భద్రతకు జగన్ ఇచ్చిన భరోసా ఇదేనా ? అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకూ వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు. సీఎం జగన్, వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ప్రజలు ఆయనకు ఇచ్చిన అధికారం.. కబ్జాలు, దోపీడీలు, అడ్డుపడినవారిని చంపడానికి లైసెన్సు అన్నట్లుగా దారుణాలకు తెగబడుతున్నారన్నారు.
"చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకి పరాకాష్ట. జగన్రెడ్డి దిశ వాహనాలకి జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు కాలేదు. వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి మహిళని అత్యంత పాశవికంగా కొట్టి చంపేశాడు. ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత? అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే..రాష్ట్రప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు." అంటూ వరుస ట్వీట్లు చేశారు.
Next Story

