Thu Feb 05 2026 03:46:25 GMT+0000 (Coordinated Universal Time)
అర్ధరాత్రి టీడీపీ నేత అరెస్ట్
శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు

శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కూన రవికుమార్ పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసును నమోదు చేసినట్లు తెలిసింది. పోలీసులను దుర్భాషలాడటమే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
సోదరుడి ఇంట్లో...
శ్రీకాకుళంలోని శాంతినగర్ లోని తన సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న కూన రవికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడిని వెంటనే విడుదల చేయాలని ఆయన అన్నయ్య సత్యనారాయణ కోరారు. అర్థరాత్రి తమ ఇంట్లోకి ప్రవేశించి అక్రమంగా కూన రవికుమార్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
Next Story
