Fri Dec 05 2025 21:51:11 GMT+0000 (Coordinated Universal Time)
పులివెందులపై ఫోకస్ పెట్టండి.. ఎన్నికల కమిషన్ కు కనకమేడల లేఖ
పులివెందుల అసెంబ్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు

పులివెందుల అసెంబ్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టిన సీఐ అశోక్ రెడ్డిని బదిలీ చేయాలని ఆయన లేఖలో కోరారు. ఫంక్షనల్ పోస్టు అంటూ ఎస్పీ కప్పిపుచ్చుతున్నారన్నారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.
బీటెక్ రవికి భద్రత కల్పించాలని...
ఫంక్షనల్ పోస్టులకు ఈసీ అభ్యంతరం తెలపలేదంటున్నారన్నారు. బీటెక్ రవికి ప్రాణహాని లేదని ఎస్పీ చెప్పడం వాస్తవ విరుద్ధమని కనకమేడల రవీంద్ర కుమార్ లేఖలో తెలిపారు. రవికి భద్రతపై అధికారులు తేల్చకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శమన్న కనకమేడల జగన్ పై పోటీ చేస్తున్న బీటెక్ రవికి వెంటనే భద్రత కల్పించాలని, పులివెందులలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు.
Next Story

