Tue Jan 20 2026 23:48:54 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అరెస్ట్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావును అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని ఆయన నివాసంలో శ్రీనివాస రావుతోపాటు ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు గంటాపై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఆయన కుమారుడు రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటులో గంటా పైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారంలో షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సీఐడీ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అందులో భాగంగానే చంద్రబాబు, గంటాను అరెస్ట్ చేసారు.
News Summary - tdp leader ganta srinivasa rao arrested in skill development case
Next Story

