Sun Mar 15 2026 07:41:20 GMT+0530 (India Standard Time)
మంత్రి పొంగులేటికి కౌంటర్ ఇచ్చిన నరేంద్ర
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి ఇంకా జగన్ పార్టీ పోకడల నుంచి బయటపడలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమాత్రం తగ్గలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, వరదల కారణంగా అక్కడ భూములను కొనుగోలు చేయడానికి సాహసించడం లేదని పొంగులేటి అన్నారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత...
దీనిపై ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సమర్థత, విజన్ ను చూసి మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

