Tue Mar 24 2026 06:21:57 GMT+0530 (India Standard Time)
Chandrababu : మీ భూమి మీకు దక్కకుండా చేయడానికే జగన్
జగన్ అధికారంలోకి వస్తే మీ భూమి మీకు ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

జగన్ అధికారంలోకి వస్తే మీ భూమి మీకు ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దర్శి నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీ భూమిపై హక్కు మీకు ఉండకుండా చేయడమే దీని వెనుక కుట్ర అని అన్నారు. ఈ భూమి మీదని, పెత్తనం మాత్రం జగన్ ది అని అన్నారు.
రక్తం పీల్చే జలగ...
రక్తం పీల్చే జలగ లాంటి జగన్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. తాను మాత్రం రక్తం ఇచ్చి జనాలను ఆదుకుంటానని అన్నారు. ఈ సైకో జగన్ అందరి మెడలకు ఉరితాళ్లను బిగుస్తున్నారన్నారు. అప్రమత్తంగా లేకపోతే మీ భూముల దక్కవంటూ చంద్రబాబు అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తాను సంతకం చేస్తానని తెలిపారు.
Next Story

