Mon Mar 16 2026 14:31:34 GMT+0530 (India Standard Time)
Chandrababu : పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం
తుపాను బాధితులకు పార్టీ నేతలు అండగా నిలబడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు

తుపాను బాధితులకు పార్టీ నేతలు అండగా నిలబడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. మిచౌంగ్ తుఫాను దృష్ట్యా పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. తుఫాను బాధితులను ఆదుకునేలా పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులను సహాయ కేంద్రాలు తరలించేందుకు సాయపడాలని కోరారు.
తుఫాను బాధితులను...
ప్రభుత్వ పరంగా మాత్రమే కాకుండా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలబడాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. తుఫాను వంటి కష్ట సమయంలో అండగా నిలిచి మానవత్వాన్ని చాటు కోవాలని ఆయన కోరారు. ప్రాణ నష్టం జరకుండా చూస్తూ అందరికీ శుద్ధమైన తాగు నీరు, భోజన సదుపాయాలను కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు.
Next Story

