Fri Dec 05 2025 17:40:57 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కుంభకోణంపై జగన్ అరెస్ట్ చేసి విచారణ జరపాలి
టి.డి.ఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు

టి.డి.ఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్లు దోపిడీ జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలో మరో దోపిడీకి తెరతీశారన్నారు. మురికి వాడలో రోడ్లు వేసే పేరుతో 36 కోట్లు పేరుతో 700 కోట్లు దోచుకున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవమని, జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకరరెడ్డి, కొట్టు సత్యనారాయణ, మూర్తిలను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.
సీఐడీకి ఫిర్యాదుచేస్తా....
ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న బుద్దా వెంకన్న జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయలకు గండి కొట్టి.. వారి సొంత ఖజానాలను నింపుకున్నారన్నారు. ఈ కుంభకోణాలపై సీఐడీ కి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. జగన్ తో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, అక్కడ పని చేసిన అధికారులను సీఐడీ విచారించాలని ాయన కోరారు. జగన్ ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టారని, ఇప్పటి వరకు రెండు వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
Next Story

