Sun Mar 15 2026 14:04:31 GMT+0530 (India Standard Time)
Av Subbareddy : అఖిలప్రియ చెప్పే ఆ కోవర్టు నేనే
అధినాయకత్వం ఆదేశిస్తే తాను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు

అధినాయకత్వం ఆదేశిస్తే తాను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. అఖిలప్రియకు తప్ప ఆళ్లగడ్డ సీటు ఎవరికి ఇచ్చినా తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. భూమా అఖిలప్రియ ఆరోపించే కోవర్టును తానేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఆళ్లగడ్డ సీటును అఖిలప్రియకు ఇస్తామని ఎవరికి చెప్పారని ఆయన ప్రశ్నించారు.
ఎవరు చెప్పారు?
అఖిలప్రియ చెవిలో చెప్పారా? అని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీటును ప్రకటిస్తే బహిరంగంగానే చేస్తారని, చెవిలో చెప్పరంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డ లేదా నంద్యాల సీటులో ఎక్కడ ఇచ్చినా తాను పోటీ చేస్తానని, ఖచ్చితంగా గెలుస్తానని ఏవీసుబ్బారెడ్డి చెప్పడం విశేషం.
Next Story

