Thu Mar 19 2026 15:05:01 GMT+0530 (India Standard Time)
రాజమండ్రిలో కీలక సమావేశం రేపే
తెలుగుదేశం పార్టీ, జనసేన కో - ఆర్డినేషన్ కమిటీ సమావేశం రేపు జరగనుంది రాజమండ్రిలో భేటీ జరుగుతుంది

తెలుగుదేశం పార్టీ, జనసేన కో - ఆర్డినేషన్ కమిటీ సమావేశం రేపు జరగనుంది. తొలి సారి రెండు పార్టీల మధ్య జరగనున్న ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న రాజమండ్రిలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
భవిష్యత్ కార్యాచరణను...
ఈ సమావేశంలో టీడీపీ, జనసేనల ఉమ్మడి పోరాటంతో పాటు, సమన్వయంపై కూడా చర్చించనున్నారు. రెండు పార్టీలూ ఇప్పటికే సమన్వయ కమిటీలను నియమించాయి. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి రెండు పార్టీలు కలసి కార్యాచరణను రూపొందించనున్నాయి. అలాగే ఉమ్మడి సమావేశాల ఏర్పాటు పై కూడా చర్చ జరగనుంది. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ఏ విధంగా రాష్ట్రంలో ప్రజల మధ్యకు వెళ్లాలన్న దానిపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు.
Next Story

