Sun Mar 15 2026 08:53:43 GMT+0530 (India Standard Time)
టీడీపీ కీలనిర్ణయం
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది

తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది. సభ నుంచి బయటకు వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సభలో తమ వాయిదా తీర్మానాలను అనుమతించకపోవడం, తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
సెషన్ మొత్తం...
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈరోజు రెండో రోజు. రెండో రోజు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుపై చర్చను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే తమ సభ్యులను సస్పెండ్ చేయడంతో టీడీపీ శాసనసభ్యులు అందరూ సభను వదిలి వెళ్లిపోయారు. ఈ సమావేశాలను మొత్తం బహిష్కరించాలని నిర్ణయించారు.
Next Story

