Thu Dec 18 2025 05:16:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
తెలుగుదేశం పార్టీ ఉభయ సభల్లో ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది

తెలుగుదేశం పార్టీ ఉభయ సభల్లో ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలను సహజమరణాలుగా చిత్రీకరిస్తూ సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై చర్చ జరగకుండా ప్రభుత్వం గుడ్డిలెక్కలు చెబుతూ సభను పక్కదారి పట్టిస్తుందని నోటీసుల్లో తెలుగుదేశం పార్టీ పేర్కొంది.
విచారణ జరపాలని కోరినా....
అయితే తాము జంగారెడ్డిగూడెంలో వరస మరణాలపై విచారణ అడిగితే ప్రభుత్వం పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. నాటుసారా తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు.
- Tags
- assembly
Next Story

