Sat Mar 07 2026 14:56:57 GMT+0530 (India Standard Time)
సజ్జలపై సీఈసీకి ఫిర్యాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు చోట్ల ఉన్నాయని పేర్కొంది. మంగళగిరితో పాటు పొన్నూరులో ఆయనకు ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అచ్చన్న లేఖ...
సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవలని టీడీపీ పేర్కొన్న ఫిర్యాదులో పేర్కొంది. రెండు చోట్ల కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, వెనువెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ కావాలనే రెండు చోట్ల తన ఓటును ఆయన నమోదు చేయించుకున్నారని తెలిపారు.
Next Story

