Sat Mar 28 2026 21:36:38 GMT+0530 (India Standard Time)
ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ఒంటరిపోరే
అండమాన్ నికోబార్ దీవుల్లో ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు కసరత్తు జరిగింది.

అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు కసరత్తు జరిగింది. రెండు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తులతోనే ఈ ఎన్నికల బరిలోకి దిగుతాయని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. అయితే ఉన్న పళంగా తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది.
తొలుత పొత్తుకోసం....
అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న స్థానికసంస్థల ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే అక్కడ తెలుగు వారు కొంత ఉండటంతో టీడీపీ ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావించింది. టీడీపీ కూడా అంగీకరించింది. అయితే కాంగ్రెస్, టీడీపీ పొత్తు వార్తలు వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం ఈ పొత్తుపై విముఖత చూపింది. స్థానిక నేతలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పొత్తు ఉండదని అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ నేత మాణిక్యరావు తెలిపారు.
Next Story

