Fri Jun 20 2025 01:39:52 GMT+0000 (Coordinated Universal Time)
నూజివీడు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ సైకిల్ పార్టీకే
నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది.

నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మంత్రి పార్థసారధి ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టి వైసీపీ కార్పొరేటర్ల మద్దతును సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో అత్యధిక శాతం మంది వార్డు మెంబర్లు టీడీపీ వైస్ ఛైర్మన్ కు మద్దతివ్వడంతో నూజివీడు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లయింది. మెజారిటీ సభ్యులు టీడీపీ అభ్యర్థికే మద్దతు పలికారు.
నందిగామ ఎన్నిక వాయిదా...
మరొకవైపు నందిగామ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎన్నిక నిలిచిపోయింది. అయితే ఇక్కడ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య ఛైర్మన్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. కేశినేని చిన్ని సిఫార్సు అభ్యర్థిని సౌమ్య వ్యతిరేకించడంతో ఎన్నిక వాయిదా పడింది. రేపు ఈ ఎన్నిక జరిగే అవకాశముంది.
Next Story