Thu Feb 13 2025 03:31:01 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తిరుపతి కూడా టీడీపీకే
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలిచారు. మునికృష్ణకు మద్దతుగా 26 మంది కార్పొరేటర్లు నిలిచారు. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ కు మద్దతుగా 21 మంది నిలిచారు. దీంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
రెండు వర్గాలు...
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. రెండు పార్టీలూ క్యాంప్ రాజకీయాలను గత కొంతకాలంగా చేస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలపడంతో కూటమి అభ్యర్థి గెలిచినట్లయింది. అనేక ఉత్కంఠల మధ్య పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
Next Story