Sun Apr 27 2025 09:26:05 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులోనూ టీడీపీ పాగా
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది

నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నిక జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న పదవులకు నేడు ఎన్నిక జరిగింది. దీంతో రెండు పార్టీలూ గెలుపు కోసం శ్రమించాయి.
వైసీపీ నుంచి వచ్చి...
అధికారం కోల్పోవడంతో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, వార్డు సభ్యులు కూటమి పార్టీల వైపునకు రావడంతో దాదాపు అన్ని స్థానాలను అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అనేక చోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. నెల్లూరు కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసిన తహసీన్ కు 41 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి కేవలం 21 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Next Story