Sat Jan 31 2026 11:09:28 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీకి కేశినేని శ్వేత గుడ్ బై
బెజవాడలో తెలుగుదేశం పార్టీకి మరోషాక్ తగిలింది. కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత మరికాసేపట్లో రాజీనామా చేయనున్నారు.

బెజవాడలో తెలుగుదేశం పార్టీకి మరోషాక్ తగిలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత మరికాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కు వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటారని కేశినేని నాని సన్నిహితులు వెల్లడించారు.
పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి...
అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా కేశినేని శ్వేత రాజీనామా చేయనున్నారు. అంతకు ముందు తనను కార్పొరేటర్ గా గెలవడానికి సహకరించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. కేశినేని నానికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని చెప్పడం, ఆయన పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో ఆయన కుమార్తె శ్వేత కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కేశినేని నాని తన Xఅకౌంట్ ద్వారా తెలియపరిచారు.
Next Story

