Thu Mar 19 2026 04:27:29 GMT+0530 (India Standard Time)
రాళ్లదాడి ఘటనపై ఆగ్రహం
చంద్రబాబు కాన్వాయ్‌పై యర్రగొండపాలెంలో వైసీపీ రాళ్లదాడి ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై యర్రగొండపాలెంలో వైసీపీ రాళ్లదాడి ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి రాళ్ల దాడి, ఇతర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే ఈమెయిల్ ద్వారా ఘటన వివరాలు రాజ్‌భవన్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు పంపారు. చంద్రబాబుపై జరిగిన ఘటనలను ప్రస్తావిసూ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు.
కేంద్రానికి ఫిర్యాదు చేయాలని...
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఘటనలను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయాలని చంద్రబాబు కూడా నేతలను ఆదేశించినట్లు తెలిసింది. నిన్న జరిగిన ఘటనపై ముందుగా యర్రగొండపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా ఎస్పీకి ఈ మేరకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
Next Story

